జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) పట్నాలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా బిహార్ సివిల్ సర్వీసెస్ (BPSC) పరీక్షను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులతో కలిసి ప్రశాంత్ కిశోర్ నిరవధిక నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ప్రశాంత్ కిశోర్‌ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి గాంధీ మైదాన్ నుంచి తీసుకెళ్లారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ లభించడంతో విడుదలయ్యారు.
కానీ నాలుగు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. డీహైడ్రేషన్, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న పీకేను ఆసుపత్రికి తరలించారు. ఆయన బలహీనంగా ఉన్నారని మెరుగైన చికిత్స అవసరం ఉందని వైద్యులు తెలిపారు. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం ప్రభుత్వం BPSC పరీక్షను రద్దు చేసే వరకు ఆసుపత్రిలోనే నిరాహార దీక్ష చేస్తానని తేల్చిచెప్పారు.