జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) నూతన ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు రిటైర్జ్ జడ్జి వి. రామసుబ్రమణియన్(V. Ramasubramanian) నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీ కాలం జూన్ 1న ముగిసింది. అనంతరం తాత్కాలిక చైర్‌పర్సన్‌గా విజయ భారతి సయానీ నియమితులయ్యారు. తాజాగా పూర్తి ఛైర్మన్‌గా రామసుబ్రమణియన్ నియమితులయ్యారు.
కాగా రామసుబ్రహ్మణ్యం తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. మద్రాస్ లా కాలేజీలో LLB పూర్తి చేసి 1983 ఫిబ్రవరి 16లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించి 23 సంవత్సరాలపాటు పనిచేశారు. 31 జూలై 2006లో మద్రాస్ హైకోర్టు న్యాయవాదిగా నియమితులై 2016 ఏప్రిల్ 26 వరకు పనిచేశారు. 2016 ఏప్రిల్ 27 నుంచి 2019 జూన్ 21 వరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా.. 2019 జూన్ 22 నుంచి 2019 సెప్టెంబరు 22 వరకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అనంతరం 2019 సెప్టెంబరు 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2023 జూన్ 30వ తేదీ వరకు కొనసాగారు.