భారత ప్రధాని మోదీ(PM Modi) దేశ ప్రజలకు న్యూఇయర్(New Year) శుభాకాంక్షలు తెలిపారు.ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 2025 సంవత్సరం ప్రతి ఒక్కరికి కొత్త అవకాశాలు, విజయం, ఆనందాన్ని తీసుకురావాలని.. ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఆరోగ్యం, శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలని చెప్పారు.
- Advertisement -
ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. భారతదేశ స్థిరమైన భవిష్యత్తు కోసం అందరం కలిసి పని చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్రమంత్రులు, ఎంపీలు, ఇతర రాష్ట్రాల సీఎంలతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ప్రజలకు న్యూఇయర్ విషెస్ చెప్పారు.