Prime Minister Modi visits Chandrababu and Pawan residences: నేడు తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నివాసాలకు ప్రధాని మోదీ వెళ్లారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని.. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు, పవన్ నివాసాలకు వెళ్లారు. తొలుత పవన్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. సైనస్ సమస్య కారణంగా పవన్ కల్యాణ్‌కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇంటికి మోదీ వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రధానికి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్ ఆత్మీయ స్వాగతం పలికారు. ఇప్పడు దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

