ఈ నెల 28న ప్రధాని మోదీ (Narendra modi) రామనాథపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా పంబన్ వద్ద మండపం, రామేశ్వరం దీవిని కలుపుతూ సముద్రంపై రూ.550 కోట్లతో నిర్మించిన రైలు వంతెనను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని రామేశ్వరం, ధనుష్కోడి ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. వంతెన ప్రారంభోత్సవ ప్రాంతంలో వేదిక నిర్మాణ పనులకు కూడా అధికారులు శ్రీకారం చుట్టారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో శుక్రవారం దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్‌ఎన్ సింగ్ ఇతర అధికారులు పంబన్ కొత్త వంతెనపై తుది విడత పరిశీలన, తనిఖీ నిర్వహించారు. రైల్వే శాఖ ఉన్నతాధికారులు, కేంద్ర భద్రతా విభాగం ఉన్నతాధికారులు కూడా ఆ రైలు వంతెనను పరిశీలించారు. ఆ వంతెన మధ్యలో ఉన్న హైడ్రాలిక్ లిఫ్ట్‌ల పనితీరు కూడా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్‌ఎన్ సింగ్.
అమెరికా నుండి భారత్ కు ప్రధాని
రెండు రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత్ కు తిరుగు పయనమయ్యారు. భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బయలుదేరిన ప్రధానికి ఆ దేశ ఉన్నతాధికారుల బృందం ఘనంగా వీడ్కోలు పలికింది.