HomeTop StoriesRoad Accident: లోయలో పడ్డ ప్రైవేట్‌ బస్సు.. 16 మంది మృతి

Road Accident: లోయలో పడ్డ ప్రైవేట్‌ బస్సు.. 16 మంది మృతి

Jammu Kashmir Road Accident: జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు రామ్ నగర్- ఉదంపూర్ హైవేపై అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 16 మంది మృతి చెందారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 40కి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/karimnagar-news/jagityala-mla-sanjay-says-he-will-contest-from-congress-party-in-2028-elections/

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదంపూర్ జిల్లాలోని రామ్ నగర్ ఏరియా, కాగోర్ట్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఒక ప్రమాదకరమైన మలుపు వద్ద బస్సు అదుపు తప్పి సుమారు 70 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లినట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే ఉదంపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు, పోలీసులు, SDRF బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News