Thursday, January 22, 2026
Homeనేషనల్Priyanka Gandhi: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల కోసమే వందేమాతరంపై చర్చ- ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల కోసమే వందేమాతరంపై చర్చ- ప్రియాంక గాంధీ

Priyanka Gandhi On Vande Mataram Topic: పార్లమెంట్‌లో ‘వందేమాతరం’పై చర్చను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా..ఇప్పుడు ఈ అంశంపై ఎందుకు చర్చ పెట్టారని కేంద్రంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలోని ప్రతి అణువులో వందేమాతరం ఉందని.. ఇప్పుడు దాని గురించి చర్చించాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల నేపథ్యంలోనే ప్రధాని మోదీ వందేమాతరం గురించి చర్చిస్తున్నారని విమర్శించారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/indigo-crisis-explained-why-media-targets-union-minister-rammohan-naidu-whos-fault-was-it/

లోక్‌సభలో ‘వందేమాతరం’పై చర్చ రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది. కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వందేమాతరంపై కేంద్రం ప్రస్తుత చర్చపై రెండు కారణాలున్నాయని ఆమె ఆరోపించారు. మొదటిది బెంగాల్‌ ఎన్నికలు కాగా, రెండోది దేశం కేసం త్యాగాలు చేసిన వారిపై కొత్త ఆరోపణలు చేయాలన్నదే ఈ ప్రభుత్వ కోరిక అని ఆరోపించారు. దేశ భవిష్యత్తు గురించి మాట్లాడకుండా మనల్ని గతంలోకి లాక్కెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుందని.. ఒకప్పటి ప్రధానిలా నేడు మోదీ లేరని విమర్శించారు. 

Also Read: https://teluguprabha.net/telangana-news/jr-ntr-approached-the-delhi-high-court/

‘ప్రధాని మోదీ విధానాలు నేడు దేశాన్ని బలహీనపరుస్తున్నాయి. ప్రజా సమస్యలపై ఒత్తడి తేకుండా దేశం దృష్టిని మళ్లించాలని వందేమాతరంపై చర్చ పెట్టింది. వందేమాతరం స్వభావాన్ని చర్చించడం, దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న గొప్ప వ్యక్తులను అవమానించడమే ఈ చర్చ ఉద్దేశం. పండిట్‌ జవహరలాల్‌ నెహ్రూ ఇస్రో, గెయిల్‌, బీహెచ్‌ఈఎల్‌, సెయిల్‌లను సృష్టించకపోతే భారత్‌ ఇప్పుడు ఎలా ఉండేది. ఆయన ఈ దేశం కోసమే జీవించారు.’ అని ప్రియాంక స్పష్టం చేశారు.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News