Saturday, November 15, 2025
Homeనేషనల్Priyanka Gandhi: బాణం ఎక్కుపెట్టిన ప్రియాంక గాంధీ..!

Priyanka Gandhi: బాణం ఎక్కుపెట్టిన ప్రియాంక గాంధీ..!

Priyanka Gandhi Wayanad Visit: వయనాడ్‌లో ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన ఓ పని అందరినీ ఆకట్టుకుంటోంది. వయనాడ్‌ పర్యటనలో భాగంగా ఆమె పద్మశ్రీ పురస్కార గ్రహీత, సంప్రదాయ వరి వంగడాల సంరక్షకుడు చెరువయల్ రామన్ ఇంటికి వెళ్లారు. ఆయన సంప్రదాయ జీవన శైలి గురించి అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

పద్మశ్రీ రామన్ ఇంటికి ప్రియాంక: పది రోజుల పర్యటనలో భాగంగా ప్రియాంక గాంధీ పద్మశ్రీ చెరువయల్ రామన్‌ను కలిశారు. రామన్ తన వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 60 రకాల సంప్రదాయ వరి విత్తనాలను ఎలా కాపాడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. పొలాల్లో స్వయంగా నడిచి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఆసక్తిగా అడిగారు. ఈ సందర్భంగా రామన్ పాడిన జానపద గీతాలను ఆమె ఆసక్తిగా విన్నారు. అనంతరం అక్కడి గిరిజన సంప్రదాయమైన విలువిద్యను నేర్చుకుని.. విల్లు-బాణం ఎక్కుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Also Read:https://teluguprabha.net/national-news/national-agriculture-conference-rabi-abhiyan-2025-delhi/

ప్రజా సమస్యలపై దృష్టి: వయనాడ్‌లో ప్రియాంక గాంధీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎంపీల్యాడ్స్ నిధుల కింద పనమరం గ్రామంలో ఏర్పాటు చేసిన తాగునీటి ప్రాజెక్టును ఆమె ప్రారంభించారు. అంతేకాకుండా చాలా కాలంగా నిలిచిపోయిన పూలిథోడ్-పడింజరత్తర రహదారి పనులను పరిశీలించారు. ప్రజల అవసరాలు, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత పాటించాల్సిన ఆవశ్యకతను ప్రియాంక గాంధీ నొక్కి చెప్పారు.

ప్రముఖులతో భేటీ: ఈ పర్యటనలో ఆమె పలువురు మత, సాంస్కృతిక ప్రముఖులతో భేటీ అయ్యారు. రచయిత ఎం.ఎన్. కరస్సేరి, పండితుడు డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ హకీం అజహరి, అలాగే బిషప్ రెమిగియోస్ ఇంచనానియిల్తో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో మానవ-జంతు ఘర్షణ, మైనారిటీల భద్రత, బైపాస్ రోడ్డు వంటి స్థానిక సమస్యలపై ఆమెకు వివరించారు. ఈ సమస్యలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికే ఈ పర్యటన అని ప్రియాంక గాంధీ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad