Monday, July 1, 2024
Homeనేషనల్Priyanka Vadra: రాయ్ బరేలీ బరిలో ప్రియాంక ? ఇక ప్రియాంక పొలిటికల్ కెరీర్ స్టార్ట్

Priyanka Vadra: రాయ్ బరేలీ బరిలో ప్రియాంక ? ఇక ప్రియాంక పొలిటికల్ కెరీర్ స్టార్ట్

గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తున్న ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో సోనియా గాంధీ పోటీ చేయకుండా తన కుమార్తె ప్రియాంకా గాంధీని బరిలోకి దింపే అవకాశాలున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి దిగుతున్నట్టు స్పష్టమవుతోంది. తమ సంప్రదాయ నియోజకవర్గం రాయ్ బరేలీలో ఈమె గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచే సెంటిమెంటల్ గా ఆమె క్రియాశీల రాజకీయాల్లో తన ఇన్నింగ్స్ మొదలు పెడతారంటూ అప్పుడే ఊహాగానాలు ప్లీనరీ వేదికగా స్టార్ట్ అయ్యాయి.

- Advertisement -

తాను ఏదో ఒకరోజు అమేథీ లేదా రాయ్ బరేలీ నుంచి బరిలోకి దిగటం తప్పదని గతంలోనే ప్రియాంక స్పష్టంచేశారు కూడా. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇంఛార్జ్ గా పనిచేస్తున్న ప్రియాంక ఈమధ్య ఎన్నికలపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె చొరవ తీసుకుంటున్నారు.

అయితే ఆమధ్యనే బీజేపీలో చేరిన అదితి సింగ్ మాత్రం దమ్ముంటే ప్రియాంక తనపై రాయ్ బరేలీ నుంచి పోటీ చేయాలని గతంలో సవాలు చేశారు. దీనిపై ప్రియాంక ఇప్పటి వరకూ స్పందించ లేదు. ఇప్పుడు రాయ్ బరేలీ కాంగ్రెస్ కంచుకోట కాదని అదితి పదేపదే చెబుతూ వస్తున్నారు. కాగా కాంగ్రెస్ కు మరో పెట్టని కోట అయిన అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఘోర పరాజయం పాలై చివరికి కేరళలోని వేనాడ్ నుంచి ఆయన లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ప్రియాంక రాయ్ బరేలీ నుంచి నిజంగా పోటీచేస్తే బీజేపీ చేతిలో ఆమె ఓటమి ఖాయమా అంటూ పెద్ద ఎత్తున చర్చలు ఊపందుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News