Sunday, November 16, 2025
Homeనేషనల్Karnataka: దక్షిణాది రాష్ట్రంలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు.. ముగ్గురు అరెస్ట్!

Karnataka: దక్షిణాది రాష్ట్రంలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు.. ముగ్గురు అరెస్ట్!

Pro-Pakistan slogans: కర్ణాటక రాష్ట్రంలోని ఈద్ మిలాద్ ప్రదర్శనలో వివాదాస్పద నినాదాలు చోటు చేసుకున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలు, ఆడియో క్లిప్‌లు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఆ వివాదాస్పద నినాదాలు ఏంటీ..? అవి ఏ దేశం గురించి చేశారనే విషయాలను తెలుసుకందాం.

- Advertisement -

డ్యాన్స్ చేస్తూ మరీ నినాదాలు: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ, విజయపుర జిల్లాల్లో పలు వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈద్ మిలాద్ ప్రదర్శనల సందర్భంగా జరిగిన ప్రదర్శనలో కొందరు యువకులు పాకిస్తాన్‌కు అనుకూల నినాదాలు చేశారు. డీజే మ్యూజిక్‌కు డ్యాన్స్ చేస్తూ మరీ.. ఈ నినాదాలను యువకులు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసులు నమోదు చేశారు. అసలెందుకు అలాంటి నినాదాలు చేశారనే అంశంపై విచారణ చేస్తున్నట్లుగా.. పోలీసు అధికారులు తెలిపారు.

Also Read:https://teluguprabha.net/national-news/madhya-pradesh-man-mistaken-for-dead-shocks-police/

వీడియో నిజమైనదా..? కాదా..?: భద్రావతిలో నిన్న జరిగిన ఈద్ మిలాద్ ర్యాలీలో పాకిస్తాన్ అనుకూల నినాదాల వీడియో వైరల్ అంశంపై శివమొగ్గ జిల్లా ఎస్పీ స్పందించారు. ఆ వీడియో ఎప్పుడు తీశారు.. ఎక్కడ తీశారు.. ఎవరెవరు నినాదాలు చేశారనే దానిపై విచారణ చేస్తున్నట్లుగా తెలిపారు. అసలు ఈ వీడియో నిజమైనదా..? కాదా..? అనే కోణంలో సైతం దర్యాప్తును కొనసాగిస్తున్నట్లుగా ఎస్పీ పేర్కొన్నారు.

పోలీసులు 15 నిమిషాలు పక్కన నిలబడితే: విజయపురలో జరిగిన ఈద్ మిలాద్ వేడుకల సందర్భంగా మరో వివాదం చోటుచేసుకుంది. డీజే వాహనంలో రెచ్చగొట్టే ఆడియోలను ప్లే చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో పోలీసులు 15 నిమిషాలు పక్కన నిలబడితే.. ఎవరి దమ్ము ఎంతో తెలిపిపోతుందనే వ్యాఖ్యలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad