HomeTop StoriesProducer Dil Raju: నువ్వు నిజంగా దిల్‌ ఉన్న రాజువయ్యా.. దిల్‌రాజు చేసిన పనికి నెటిజన్లు...

Producer Dil Raju: నువ్వు నిజంగా దిల్‌ ఉన్న రాజువయ్యా.. దిల్‌రాజు చేసిన పనికి నెటిజన్లు ఫిదా..!

Producer Dil Raju stands by Pavala Shyamala: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మరియు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మరోసారి తన దయాగుణాన్ని చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చికిత్స చేయించుకోలని పరిస్థితిలో ఉన్న సీనియర్‌ నటి పావలా శ్యామలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. పావలా శ్యామల దయనీయ పరిస్థితి గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఆయన తక్షణమే స్పందించి ఆమె పూర్తి వైద్య బాధ్యతలను తీసుకున్నారు. పావలా శ్యామల ప్రస్తుతం వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత రాత్రి చికిత్స కోసం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా డబ్బు లేదనే కారణంతో ఆసుపత్రి యాజమాన్యం ఆమెను జాయిన్‌ చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో, డబ్బుల్లేక శ్యామల, ఆమె కుమార్తెను క్యాబ్ డ్రైవర్ నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. స్థానికులు ఆమె దీనస్థితికి సంబంధించిన ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా.. అవి కాస్తా వైరల్‌గా మారి దిల్ రాజు దృష్టికి వెళ్లింది. వెంటనే చలించిపోయిన దిల్‌రాజు.. పావలా శ్యామలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. పావలా శ్యామలను కూకట్‌పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్‌లో చేర్చించి, చికిత్సకు కవాల్సిన డబ్బు చెల్లిస్తానని దిల్‌రాజు స్పష్టం చేశారు. స్వయంగా ఆసుపత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి.. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Also read: Rajinikanth: పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవాన్ని.. విజయ్‌ నాకు సమవుజ్జీ కాదు.. రజినీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు

పూర్తి బాధ్యత నేను తీసుకుంటా.. పావలా శ్యామలకు భరోసా..

వైద్యుల వివరాల ప్రకారం, పావలా శ్యామల గత కొంత కాలంగా గాల్‌బ్లాడర్ సమస్యతో పాటు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో శ్యామలకు అత్యుత్తమ వైద్యం అందించాలని, ఖర్చుల గురించి ఆందోళన అవసరం లేదని, పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని వైద్యులకు ఆయన భరోసానిచ్చారు. అనంతరం దిల్ రాజు బృందం ఆసుపత్రికి వెళ్లి శ్యామలను పరామర్శించగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తనకు అండగా నిలిచిన దిల్ రాజుకు చేతులెత్తి మొక్కుతూ కృతజ్ఞతలు తెలిపారు. తన తల్లి చికిత్సకు ముందుకొచ్చిన దిల్ రాజుకు రుణపడి ఉంటామని పావలా శ్యామల కూతురు భావోద్యేగానికి లోనయ్యారు. ఇలా కష్టకాలంలో ఉన్న ఒక సీనియర్ నటిని ఆదుకోవడానికి ముందుకొచ్చిన దిల్ రాజుపై సినీ వర్గాలు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News