ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్(Medha Patkar) అరెస్ట్ అయ్యారు. 2000 సంవత్సరంలో నమోదైన పరువు నష్టం కేసుకు సంబంధించి ఆమెను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దాఖలు చేసిన ఈ కేసులో న్యాయస్థానం మేధా పాట్కర్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
అసలు ఏం జరిగిందంటే.. 2000 సంవత్సరంలో సక్సేనా ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్’ అనే స్వచ్ఛంద సంస్థకు అధినేతగా వ్యవహరించేవారు. ఆ సమయంలో ‘నర్మదా బచావో ఆందోళన్’కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారని ఆరోపిస్తూ సక్సేనాపై మేధా పాట్కర్ ఓ కేసు దాఖలు చేశారు. దీంతో సక్సేనా కూడా పాట్కర్‌పై పరువు నష్టం కేసులు దాఖలు చేశారు. తాజాగా ఈ కేసుల్లో ఒకదానికి సంబంధించి కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.