Sunday, November 16, 2025
Homeనేషనల్PSLV-C54: మరికొద్ది సేపట్లో నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్‌వీ సీ54.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే?

PSLV-C54: మరికొద్ది సేపట్లో నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్‌వీ సీ54.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే?

PSLV-C54: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరికొద్దిసేపట్లో పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్‌ ను నింగిలోకి ప్రయోగించనుంది. శ్రీహరికోటలో సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఇవాళ ఉదయం 11.56 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్తుంది. పీఎస్ఎల్వీ సీ54 ద్వారా కక్ష్యలోకి ఈవోఎస్ 06 (ఓషన్ శాట్ 03) అనే ఉపగ్రహాన్ని పంపించనున్నారు. దీనితోపాటు మరో ఎనిమిది ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్ష కక్ష్యలోకి పంపనుంది.

- Advertisement -

భారత్‌‌కు చెందిన తైబోల్ట్‌–1, తైబోల్ట్‌–2, ఆనంద్, ఇండియా – భూటాన్‌ దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అకా ఐఎన్‌ఎస్‌–2బీ, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకాస్ట్‌ –2 పేరుతో నాలుగు శాటిలైట్లను ఇస్రో ప్రయోగించనుంది. ఈవోఎస్ సిరీస్‌లో ఇది ఆరో ఉపగ్రహంకాగా పీఎస్ఎల్వీ సిరీస్‌లో 56వ రాకెట్ ప్రయోగం. ఈవోఎస్ 06 ఉపగ్రహం భూపరిశోధనలు, సముద్ర గర్భంలో అధ్యయనంకోసం ఉపయోగపడుతుంది.

ఇస్రో అంతరిక్ష కక్ష్యలోకి పంపించే ఎనిమిది ఉపగ్రహాల్లో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ధ్రువస్పేస్‌ రూపొందించిన తైబోల్ట్‌ 1, తైబోల్ట్‌ 2 ఉపగ్రహాలుకూడా ఉన్నాయి. ఈ ఉపగ్రహాలు రేడియో కార్యకలాపాలకు సంబంధించిన పేలోడ్లను కక్ష్యలోకి తీసుకెళ్లనున్నాయి. దాదాపు 20ఎంఎస్ఎంఈల సహాయంతో ఈ ఉపగ్రహాలను పూర్తిగా హైదరాబాద్‌లోనే నిర్మించామని ధ్రువ స్పేస్‌ సీఈవో, సహ వ్యవస్థాపకుడు సంజయ్‌ నెక్కంటి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రేడియో ఆపరేటర్లకు ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad