Pulwama-mastermind-Hamza Burhan killed: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది పాకిస్థాన్‌కు బిగ్‌షాక్ తగిలింది. పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హమ్జా బుర్హాన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కాల్చిచంపారు. పుల్వామాకు చెందిన బుర్హాన్ ఉన్నత విద్య సాకుగా చూపి 2017లో పాకిస్థాన్ దేశంలోకి వెళ్లాడు. అనంతరం నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్-బదర్‌లో చేరాడు. అతి కొద్ది కాలంలోనే కమాండర్ స్థాయికి ఎదిగాడు. అతడిని 2022లో భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2019, ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి ఘటన వెనక పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఉన్నట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన ఫిబ్రవరి 26న పీవోకేపై వైమానిక దాడులు చేపట్టింది. పాక్ భూభాగంలోని బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించింది. ఆ తర్వాత పాక్ ప్రతీకార దాడులకు దిగింది. మన గగనతలంలోకి వారి యుద్ధ విమానాలు దూసుకొచ్చాయి. అయితే, పాక్ చర్యను భారత వాయుసేన సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో మన మిగ్ విమానం ఒకటి కూలి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్ శత్రుచెరలో చిక్కుకుపోయారు. అయితే, అంతర్జాతీయ ఒత్తిడితో మూడు రోజుల తర్వాత అభినందన్‌ను పాక్ విడిచిపెట్టింది.
Also read: Mega 158 Event: అన్న కోసం తమ్ముడు.. మెగా 158వ చిత్రానికి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్

