Thursday, January 15, 2026
Homeనేషనల్Punjab Police: గంజాయి కొడుతూ కెమెరాకు చిక్కిన పోలీసు

Punjab Police: గంజాయి కొడుతూ కెమెరాకు చిక్కిన పోలీసు

Punjab Cop Caught Smoking Joint on Camera: పంజాబ్‌లో డ్రగ్స్ మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి సమాజానికి వాటి నుంచి విముక్తి కలిగించాల్సిన పోలీసే డ్రగ్స్‌ని సేవిస్తే? ఇలాంటి షాకింగ్ సంఘటన తాజాగా వెలుగు చూసింది. పంజాబ్‌లో ఓ పోలీస్ అధికారి బహిరంగంగా గంజాయి సేవిస్తూ కెమెరాకు చిక్కారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. పంజాబ్‌లో డ్రగ్స్ వినియోగం ఏ స్థాయిలో వేళ్లూనుకుపోయిందో తెలుసుకునేందుకు సంఘటనే నిదర్శనం.

- Advertisement -

పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఓ రాజకీయ నాయకుడికి గన్‌మన్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ అనే పోలీస్ అధికారి ఒక మంచంపై కూర్చుని గంజాయి వెలిగించి పొగ పీలుస్తూ కనిపించారు. ఈ షాకింగ్ వీడియో క్షణాల్లోనే ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. దీనిపై అప్రమత్తమైన ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. ప్రవీణ్ కుమార్‌ను భద్రతా విధులనుంచి తప్పించి, పోలీస్ లైన్స్‌కు బదిలీ చేశారు. అతనిపై తదుపరి విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణలో ప్రవీణ్ కుమార్‌ను గతంలో అతని కుటుంబ సభ్యులు డీ-అడిక్షన్ కేంద్రంలో చేర్చినట్లు తెలిసింది.

పంజాబ్‌లో రెండు దశాబ్దాలుగా వివిధ రాజకీయ పార్టీలు డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తున్నప్పటికీ, ఈ సమస్య ఇంకా తీవ్రంగానే ఉంది. ఇటీవల చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగంగా అనేక మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్ వినియోగదారులను జైలుకు పంపకుండా డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఘటనతో మరోసారి పంజాబ్‌లో డ్రగ్స్ సమస్య తీవ్రత చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News