Wednesday, July 16, 2025
Homeనేషనల్Jagannath Rath Yatra: కన్నుల పండుగగా జగన్నాథుడి రథయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్త జనం..

Jagannath Rath Yatra: కన్నుల పండుగగా జగన్నాథుడి రథయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్త జనం..

Jagannath Rath Yatra Live Updates: పూరీ జగన్నాథుడి రథయాత్ర కన్నులపండుగగా సాగుతోంది. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జగన్నాథుడు(కృష్ణుడు) తన సోదరుడు బలభద్రుడు(బలరాముడు0, సోదరి సుభద్రతో కలిసి ప్రధాన ఆలయం నుంచి సుమారు మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న గుండిచా అమ్మవారి ఆలయానికి రథాలపై ఊరేగింపుగా తరలివెళ్లారు. స్వామివారు అక్కడే వారం రోజులపాటు విశ్రాంతి తీసుకుని..తొమ్మిదో రోజు ప్రధాన ఆలయానికి తిరిగివస్తారు.

- Advertisement -

జగన్నాథుడు ఆశీస్సులు లభించాలనే ఉద్దేశ్యంతో.. వేలాది మంది భక్తులు రథాలను లాగేందుకు పోటీపడ్డారు. పుర వీధులన్నీ జగన్నాథుడి నామస్మరణతో మార్మోగిపోయాయి. దేశవిదేశాల నుంచి భారీగా భక్తులు వచ్చారు. ఈ యాత్రలో ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు, సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రథాలను అధిష్ఠించిన జగన్నాథుడిని పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి(81) దర్శించుకున్నారు. చెరా పహరా క్రతువును పూరీరాజు గజపతి దివ్యసింగ్ దేవ్ పూర్తి చేశారు. మూడు రథాల లోపల ఆయన బంగారు చీపురుతో ఊడిచ్చారు. ముందుగా బలరాముడు, సుభద్ర రథాలు కదలగా చివరగా జగన్నాథుడి రథం కదిలింది.

ఈ రథయాత్రకు సుమారు 15 లక్షల మంది వస్తారనే అంచనాతో ఇప్పుటికే ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. భారీగా భద్రతా బలగాలను మోహరించి..ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్‌ షెకావత్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, పూరీ ఎంపీ సంబిత్‌ పాత్రా తదితర మంత్రులు పహండీ వేడుకను వీక్షించారు.

సాధారణంగా హిందూ దేవాలయాల్లో ఉత్సవ మూర్తులను పల్లకిపై పెట్టి ఊరేగిస్తారు. కానీ పూరీలో మూల విరాట్టునే గర్భగుడి నుంచి తొసుకొస్తారు. స్వామివారి రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు. వీటి కోసం ధౌసా, ఫాసీ చెట్ల కలపను వాడతారు. సిద్దం చేసిన రథాలను బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు. జగన్నాథుడు రథం నందిఘోష, బలభద్రుడు రథం తాళధ్వజ, సుభద్రదేవీ రథం దేవదళన్ పాల్గొంటాయి. వీటిలో కృష్ణుడు రథమే పెద్దది.

రథయాత్రలో అపశృతి
అహ్మదాబాద్ గోల్​వాడలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి యాత్రలో పాల్గొన్న ఒక గజరాజు కోపంతో భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో భయాందోళన చెందిన భక్తులు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News