Monday, June 24, 2024
Homeనేషనల్Raghavendra swamy: నవీ ముంబైలో మృత్తికా బృందావనం

Raghavendra swamy: నవీ ముంబైలో మృత్తికా బృందావనం

నవీ ముంబాయిలోని ఖర్ఘర్ లో మృత్తికా బృందావనాన్ని పీఠాధిపతులు శ్రీసుభుదేంద్రతీర్థులు ప్రారంభించారు. మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీసుబుధేంద్ర తీర్థులు శ్రీరాఘవేంద్రస్వామి మృత్తికా బృందావన ప్రతిష్టాపన క్రతువులు నిర్వహించిన అనంతరం శ్రీరాఘవేంద్రస్వామి బృందావనానికి విశిష్ట పంచామృత అభిషేకం నిర్వహించారు. బృందావన ప్రతిష్ఠాపన అనంతరం శ్రీమన్మూలరాముల రథోత్సవాన్ని పీఠాధిపతులు తన చేతుల మీదుగా ప్రారంభించారు. తర్వాత శ్రీమఠం పీఠాధిపతులు శ్రీమన్మూలరాముల ప్రతిమలకు విశిష్ట పూజలు నిర్వహించి మంగళారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈసందర్భంగా సిక్కు సమాజానికి చెందిన భక్తులు కూడా ఖార్ఘర్ మఠాన్నిసందర్శించి, శ్రీరాఘవేంద్ర స్వామి బృందావన దర్శనం చేసుకుని శ్రీమఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంద్ర తీర్థుల ఆశీస్సులు పొందారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News