జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోందన్న కేంద్ర ప్రభుత్వం.. ఢిల్లీలో ఉన్నతస్థాయి భేటీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ప్రధాని మోదీ(PM Modi)తో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో పహల్గామ్‌లో తాజా పరిస్థితులు, భద్రతా బలగాల సన్నద్ధత, సైన్యం తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రధానికి వివరించినట్లు సమాచారం.
మరోవైపు పార్లమెంట్ ప్రాంగణంలో రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ అయిందిత. ఈ భేటీకి కమిటీ సభ్యులు రాధా మోహన్ సింగ్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), విష్ణుపాల్ రే, జగన్నాథ్ సర్కార్, శక్తి సింగ్ గోహిల్, సంజయ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. పహల్గామ్ దాడి అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.