HomeTop StoriesRahul Gandhi: టెలిగ్రామ్‌ మాదిరిగా వాట్సాప్‌నూ బ్యాన్‌ చేస్తారేమో..! కేంద్ర తీరుపై రాహుల్‌ ఫైర్‌

Rahul Gandhi: టెలిగ్రామ్‌ మాదిరిగా వాట్సాప్‌నూ బ్యాన్‌ చేస్తారేమో..! కేంద్ర తీరుపై రాహుల్‌ ఫైర్‌

Rahul Gandhi fires on Cnetral Government on NEET paper Leak issue: నీట్‌ రీటెస్ట్‌ నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు. కేంద్రం చర్య దొంగను పట్టుకోవడం చేతకాక.. బాధితుడి ఇంటి తలుపునకు తాళం వేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. నోట్స్, టెస్ట్ సిరీస్‌లు, సబ్జెక్ట్‌ డిస్కషన్‌, ప్రిపరేషన్ కోసం దేశంలో లక్షలాది మంది విద్యార్థులు టెలిగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారని.. ఇంతటి కీలకమైన యాప్‌పై నిషేధం విధించడం వల్ల వారు నష్టపోయే ప్రమాదముందన్నారు. అసలు ఈ ఆలోచన పేపర్‌ లీక్‌లు అరికట్టడానికి ఎలా ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. నిందితులు ఒకవేళ టెలిగ్రామ్‌కు బదులు వాట్సప్‌లో పేపర్లు లీక్‌ చేస్తే? అప్పుడు వాట్సాప్‌ను కూడా బ్యాన్‌ చేస్తారా? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

- Advertisement -

Also Read: Rythu Bharosa: రైతులకు తీపి కబురు.. ఈనెల 26 నుంచి రైతు భరోసా.. మంత్రి ఉత్తమ్‌ క్లారిటీ..!

ప్రభుత్వ కనుసన్నల్లోనే పేపర్‌ లీక్‌ మాఫియా..

టెలిగ్రామ్‌ను బ్యాన్‌ చేయడం అనేది పేర్‌ లీక్‌కు పాల్పడే ముఠా సభ్యులను కాకుండా విద్యార్థులనే లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉందని రాహుల్‌ ఆక్షేపించారు. నీట్‌ అభ్యర్థులకు జరిగిన అన్యాయం నుంచి దృష్టి మరల్చడానికే కేంద్రం ఈ తెలివైన ఎత్తుగడకు తెరతీసిందని విమర్శించారు. దేశంలో పదేపదే పేపర్‌ లీక్‌లకు పాల్పడుతున్న నిందితులపై చర్యలు తీసుకోవడంలో మోదీ యంత్రాంగం విఫలమైందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ కనుసన్నల్లోనే పేపర్ లీక్‌ మాఫియా నడుస్తోందనే అనుమానం ఉందని, దీన్ని కప్పిపుచ్చుకొనేందుకే పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా బలగాలను మోహరించడం, ప్రశ్నపత్రాలను వైమానిక దళం ద్వారా పంపించడం వంటి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం తప్పిదం వల్ల కొంతమంది నీట్‌ విద్యార్థులు ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నారని, ఇవి ప్రభుత్వ హత్యలేనని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News