ప్రధాని మోదీ(PM Modi)కి లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బహిరంగ లేఖ రాశారు. తీర ప్రాంతాలలో ఆఫ్‌షోర్ మైనింగ్ టెండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయకుండా ఆఫ్ షోర్ మైనింగ్‌కు టెండర్లు వేసిన తీరుపై తీర ప్రాంత సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. దీని వల్ల లక్షలాది మంది మత్స్యకారులు తమ జీవనోపాధి, జీవన విధానంపై దాని ప్రభావం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
స్థానికులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే, తీర ప్రాంత వర్గాల దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయకుండానే టెండర్లు జరిగాయన్నారు. ఈ ఏకపక్ష చర్యకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. కాగా కేరళ, గుజరాత్, అండమాన్ & నికోబార్ తీర ప్రాంతాలలో ఆఫ్‌షోర్ మైనింగ్ టెండర్లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.

