Tuesday, November 19, 2024
Homeనేషనల్Rahul Gandhi | ఆమెతో జ్ఞాపకాలే నా బలం -రాహుల్ గాంధీ

Rahul Gandhi | ఆమెతో జ్ఞాపకాలే నా బలం -రాహుల్ గాంధీ

నేడు భారత దేశ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆమెకి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలు ఇందిరా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) నివాళులర్పించారు.

- Advertisement -

ఢిల్లీ లోని శక్తి స్థల్‌లో ఉన్న ఇందిరా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సర్వ మత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తన నానమ్మ ఇందిరా గాంధీతో ఉన్న అపురూప ఫొటోలను ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. తన గ్రాండ్‌ మా ధైర్యం, ప్రేమ రెండింటికీ ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ఆమె నుంచి ఎన్నో నేర్చుకున్నట్లు తెలిపారు. ఆమెతో ఉన్న జ్ఞాపకాలే తన బలం అని, ఎల్లప్పుడూ అవే తనకు మార్గం చూపుతాయంటూ రాహుల్‌ తన ట్వీట్ లో పేర్కొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News