Monday, April 7, 2025
Homeనేషనల్Rahul Gandhi | ప్రాణ త్యాగానికైనా సిద్ధం - రాహుల్‌ గాంధీ

Rahul Gandhi | ప్రాణ త్యాగానికైనా సిద్ధం – రాహుల్‌ గాంధీ

భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వెల్లడించారు. శుక్రవారం ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నుదుర్బార్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

- Advertisement -

మోదీ ఒక్కసారి కూడా రాజ్యాంగాన్ని చదవలేదని… అందుకే రెడ్ బుక్ లో ఏం లేదని, ఖాళీ అని అంటున్నారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎద్దేవా చేశారు. రాజ్యాంగం భారతదేశ ఆత్మా అనే విషయాన్ని మోదీ గ్రహించాలని అన్నారు. బిర్సా ముండా, మహాత్మా పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ తదితర మహనీయుల స్ఫూర్తి రాజ్యాంగంలో ఉందని రాహుల్ చెప్పుకొచ్చారు. రాజ్యాంగంలో ఏమీ లేదంటే ఆ మహనీయులను అవమానించినట్టేనని అన్నారు. తన చేతిలో రెడ్ బుక్ ఉండడంపై అర్బన్ నక్సలిజం అంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీలు దళితులు బీసీలకు రాజ్యాధికారం ఉండాలనేదే తమ లక్ష్యం అని… అందుకే కులగుణన చేపట్టాల్సిందేనని రాహుల్ వెల్లడించారు.

    సంబంధిత వార్తలు | RELATED ARTICLES
    spot_img

    Latest News