కాంగ్రెస్ అగ్రనాయకులు, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో పార్టీ ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను, నేతలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్‌లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. అలాంటి వారందరనీ బయటకు పంపిచేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో నేతలకు కొదవ లేదు అని తెలిపారు.
గుజరాత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో రెండు రకాలున్నారన్నారు. నిజాయతీగా పనిచేస్తూ పార్టీ సిద్ధాంతాన్ని తమ గుండెల్లో పెట్టుకునేవారు ఒక రకమని.. ప్రజలతో సంబంధాలు కొనసాగించకుండా బీజేపీతో కొనసాగేవారు మరొక రకమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 22 శాతం ఓట్లు పెరిగాయని.. అసాధ్యం అనుకున్న చోట వారు సాధించి చూపించారని ప్రశంసించారు. గుజరాత్‌లో కూడా కాంగ్రెస్‌కు 40 శాతం ఓటు బ్యాంక్ ఉందని.. కానీ నాయకులు బీజేపీతో చేతులు కలిపి పార్టీ ప్రతిష్టను రోజురోజుకూ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.