ఉత్తరాదిలో విపరీతమైన చలిగాలులు గజగజ వణికిస్తుంటే రాహుల్ గాంధీ మాత్రం సింపుల్ గా ఓ టీ షర్ట్ తో భారత్ జోడో యాత్రలో కనిపిస్తుండటం చాలా డిస్కషన్స్ కు దారితీసింది. తాజాగా రాహుల్ మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. చలితో వణుకు పుట్టుకొస్తేతప్ప స్వెట్టర్ వేసుకోకూడదని తాను నిర్ణయించుకున్నట్టు రాహుల్ చెప్పారు. హర్యానాలోని అంబాలాలో మాట్లాడిన రాహుల్ తన టీ షర్ట్ పై ఇలాంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయటం అందరినీ ఆకట్టుకుంటోంది.
తానెందుకు కేవలం టీ షర్ట్ వేసుకుంటున్నాని చాలా మంది ప్రశ్నిస్తున్నారని..దానికి సమాధానం చెబుతానన్న ఆయన ఓ సంఘటన చెప్పారు. “ భారత్ జోడో యాత్రలో భాగంగా కేరళలో ఉన్నప్పుడు చాలా వేడి వాతావరణం ఉండేదని కానీ మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించగానే చలి మొదలైంది. ఒకరోజు ముగ్గురు నిరుపేద చిన్నారులు నా దగ్గరికి వచ్చారు..చినిగిన బట్టల్లో ఉన్న వారు చలితో వణికిపోతున్నారు..ఆరోజే నేను నిర్ణయించుకున్నా నాకు చలితో వణుకు పుడితే తప్ప స్వెట్టర్ వేసుకోకూడదని, ఆ ముగ్గురు అమ్మాయిలకు నేను ఇచ్చే మెసేజ్ ఏమిటంటే మీకు చలి పెడుతుంటే రాహుల్ గాంధీకి కూడా చలిపెడుతున్న లెక్క ” అంటూ భావోద్వేగంతో రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.