Tuesday, September 10, 2024
Homeనేషనల్Rains: 23 ఏళ్ల రికార్డును బ‌ద్దలు కొట్టిన ఆగ‌స్టు వ‌ర్షాలు

Rains: 23 ఏళ్ల రికార్డును బ‌ద్దలు కొట్టిన ఆగ‌స్టు వ‌ర్షాలు

న్యూఢిల్లీ: ఆగస్టు నెలలో దేశంలో కురిసిన వర్షపాతం గత 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఆగ‌స్టులో దేశంలో సాధారణం కంటే 16 శాతం ఎక్కువ వర్షపాతం నమోదవగా, వాయువ్య భారతదేశంలో 253.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. 2001 తర్వాత ఆగస్టులో ఇది రెండవ అత్యధిక వర్షపాతం. ఆగస్టులో 287.1 మి.మీ వర్షపాతం నమోదైంది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఆగస్టులో 287.1 మిమీ వర్షపాతం నమోదైంది. సాధారణం వ‌ర్ష‌పాతం 248.1 మిమీ. జూన్ ఒక‌టిన‌ రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి భారతదేశంలో సాధారణ వర్షపాతం 701 మిల్లీమీటర్ల కంటే అధికంగా 749 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

- Advertisement -

దేశంలో వర్షాకాలంలో న‌మోదైన ఉష్ణోగ్ర‌త‌లు 123 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాయి. ఆగస్టులో భారత్‌లో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 24.29 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 1901 తర్వాత ఇదే అత్యధికమని ఐఎండీ పేర్కొంది. హిమాలయ పర్వతాలు, ఈశాన్య ప్రాంతంలోని అనేక జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యింది. మహారాష్ట్రలోని కేరళ, విదర్భ ప్రాంతాల‌తో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం తక్కువగా నమోదైంది. సెప్టెంబర్‌లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రాష్ట్రాల పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News