రాజస్థాన్ సీఎం అందరికీ షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో కొత్త బడ్జెట్ చదవాల్సిన ఆయన గతేడాది బడ్జెట్ చదివి దిమ్మదిరిగేలా చేశారు. అయితే ఆయన ఒకటి రెండు నిమిషాల పాటు ఈ పాత బడ్జెట్ చదవలేదు.. ఏకంగా 8 నిమిషాలపాటు అలా పాత బడ్జెట్ ను చదువుతూ పోయారు. దీంతో రాజస్థాన్ ప్రతిపక్ష బీజేపీ సీఎం అశోక్ గెహ్లాట్ ను గేళి చేసింది. అంతేకాదు బడ్జెట్ లీక్ అయిందని కూడా బీజేపీ ఆరోపించింది. దీంతో తన తప్పు తెలుసుకున్న సీఎం గెహ్లాట్ సభకు సారీ చెప్పగా అరగంట వాయిదా తరువాత మళ్లీ సభ సజావుగా సాగింది. అయితే ఇలా పాత బడ్జెట్ ను చరిత్రలో ఎవరూ గతంలో చదవలేదని మాజీ సీఎం వసుంధరా రాజే విమర్శించారు. ఇది కచ్ఛితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్య అంటూ బీజేపీ ఆందోళనకు దిగింది.
సీఎం పాత సంక్షేమ పథకాలను చదవటం గమనించిన కాంగ్రెస్ నేత మహేష్ జోషి సీఎం ప్రసంగాన్ని ఆపించారు. కాగా తాను సీఎంగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు బడ్జెట్ ప్రతులను జాగ్రత్తగా చదివి, ఆతరువాత సభలో సమర్పించినట్టు చెప్పిన వసుంధరా గెహ్లాట్ వంటి సీఎం చేతుల్లో ఇక రాష్ట్రం ఎంతమాత్రం భద్రంగా ఉంటుందో ఆలోచించాలంటూ నిప్పులు చెరిగారు.