Saturday, November 15, 2025
Homeనేషనల్All bout Rs 60 cr cheating case: చిక్కుల్లో శిల్పాశెట్టి..ఆ 60 కోట్ల కేసు...

All bout Rs 60 cr cheating case: చిక్కుల్లో శిల్పాశెట్టి..ఆ 60 కోట్ల కేసు ఏంటంటే…

Shilpa Shetty Case:

- Advertisement -

బాలీవుడ్​ స్టార్​ శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్​కుంద్రాపై రూ.60 కోట్లు మోసం చేశారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో దంపతులపై లుక్​ అవుట్​ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ దేశం విడిచి వెళ్లొద్దని నోటీసుల్లో హెచ్చరించారు. ఈ కేసులో ఎకనామిక్​ అఫెన్సెస్​ వింగ్​ రాజ్​కుంద్రాను బుధవారం తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఆయన సెప్టెంబర్​ 15 దాకా సమయం ఇవ్వాలని కోరడంతో అధికారులు గడువు పెంచారు.

ఈనేపథ్యంలో అసలు రూ.60 కోట్ల చీటింగ్​ కేసుపై మరోసారి చర్చ మొదలైంది.

కేసు వివరాల్లోకి వెళ్తే..ముంబైలోని జుహుకి చెందిన దీపక్​ కొఠారి అనే 60 ఏళ్ల వ్యక్తి శిల్పాశెట్టి దంపతులకు చెందిన బెస్ట్​ డీల్​ అనే ఆన్​లైన్​ రిటైల్​ షాపింగ్​ ప్లాట్​ఫాం బిజినెస్​లో పెట్టుబడి పెట్టేందుకు రూ.60 కోట్లు విడతల వారీగా చెల్లించారు. కొఠారి నాన్​ బ్యాంకింగ్​ ఫైనాన్షియల్​ అయిన లోటస్​ కాపిటల్​ ఫైనాన్స్​ సర్వీసెస్​కు డైరెక్టర్​గా కొనసాగుతున్నారు. కొఠారి కంప్లయింట్​ ప్రకారం..

ఈ నేపథ్యంలో రాజేశ్​ ఆర్యా వ్యక్తి ద్వారా శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్​ కుంద్రాలు కొఠారికి పరిచయం అయ్యారు. ట్యాక్సులు చెల్లించే పని లేకుండా తమ బిజినెస్​ విస్తరించడానికి రూ.70 కోట్లు రుణం కావాలని కొఠారిని కోరారు. దీనికి తీసుకున్న రుణం చెల్లించడంతోపాటు తమ బిజినెస్​ లాభాల్లో వాటా ఇస్తామని దంపతులు హామీ ఇచ్చారు. దీంతో కొఠారి 2015 ఏప్రిల్​లో రూ.31.9 కోట్లు, అదే సంవత్సరం సెప్టెంబర్​లో రూ. 28.53 కోట్లు చెల్లించాడు. ఏప్రిల్​ 2016 కల్లా తీసుకున్న రుణం తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ 2016 సెప్టెంబర్​లో బెస్ట్​ డీల్​ డైరెక్టర్​గా శిల్పాశెట్టి వైదొలిగారు. అయితే ఆ బిజినెస్​ నష్టాల్లో ఉందని కొఠారి 2017లో గుర్తించారు. తానిచ్చిన డబ్బులు వ్యాపారాన్ని విస్తరించడానికి కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం శిల్పాశెట్టి దంపతులు ఖర్చు పెట్టినట్లు గుర్తించారు.

కాగా, కొఠారి ఆరోపణలను శిల్పాశెట్టి దంపతుల లాయర్​ ఖండిస్తున్నారు. ఇది సివిల్​ మ్యాటర్​ అని చెబుతున్నారు. సంస్థ ఆర్థికంగా నష్టాలను చవిచూసిందే, ఈ విషయం కోర్టులో పరిష్కరం అయ్యిందని అంటున్నారు. ఈ కేసులో బాలీవుడ్​ నటి దంపతులు ఎలాంటి క్రిమినల్​ చర్యలకు పాల్పడలేదని, సంబంధిత ట్రైబ్యునళ్లు, కోర్టులకు అవసరమైన డాక్యుమెంట్లను టైం టు టైం సమర్పించామని చెప్పారు.

అయితే 2015 నుంచి 2023 మధ్యకాలంలో మొత్తం రూ.60.48కోట్లు పెట్టుబడిగా పెట్టానని, బిజినెస్​ విస్తరణ కోసం తీసుకున్న డబ్బును తమ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారని కొఠారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad