సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ దాడులను భారత సైన్యం బలంగా తిప్పికొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్(Rajnath Singh) చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ దాడలు చేస్తున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసే అంశాలపై చర్చించారు. అలాగే రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలపై పాక్ గగనతల డ్రోన్లు, క్షిపణి దాడులను భారత సైన్యం తిప్పికొట్టడం, తదితర రక్షణ అంశాలపైనా మంతనాలు జరిపారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులపై రాజ్‌నాథ్ ఆరా తీసిట్లుగా తెలుస్తోంది.
కాగా పాక్ దళాలు జమ్మూ, పఠాన్ కోట్, ఉధమ్‌పుర్ సైనిక స్థావరాలపై దాడికి తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే భారత సైన్యం ధీటుగా అడ్డుకొంది. దీంతోపాటు నియంత్రణ రేఖకు సమీపంలోని పాక్ సైనిక పోస్టులను భారత్ ధ్వంసం చేసింది.