MBBS Student Raped In West Bengal: గతేడాది వెస్ట్ బెంగాల్‌లో ఓ జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే అదే రాష్ట్రంలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దుర్గాపూర్‌లోని ఓ క్యాంపస్ గేటు బయటే మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Also Read: https://teluguprabha.net/national-news/honey-trapped-by-isi-alwar-resident-held-on-spying-charges/
ఒడిశాకు చెందిన యువతి దుర్గాపూర్‌లోని శోభాపూర్ కాలేజీలో మెడిసిన్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి(అక్టోబర్ 10) యువతి తన స్నేహితుడితో కలిసి రాత్రి 8 గంటలకు తినేందుకు బయటకు వెళ్లింది. ఈ క్రమంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. క్యాంపస్ గేటు బయటే ఉన్న కొందరు వ్యక్తులు యువతిని పక్కకి లాక్కెళ్లారు. వారిలో ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా, పోలీసులకు బాధితురాలు తెలిపిన సమాచారం మేరకు తాను.. తన స్నేహితుడి కోరిక మేరకు భోజనం కోసం క్యాంపస్ బయటకు వెళ్లింది. ఆ సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వారిని అడ్డగించగా.. భయపడిన తన స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ వ్యక్తులు తనను బలవంతంగా సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లగా వారిలో ఒకరు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. తన ఫోన్ కూడా లాక్కెళ్లారని బాధితురాలు పేర్కొంది. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని బాధితురాలి తల్లి వెల్లడించింది.
Also Read: https://teluguprabha.net/national-news/supreme-court-arattai-app-whatsapp-block-petition/
కాగా, బాధితురాలిని వదిలివెళ్లిన తన స్నేహితుడే తిరిగి తనను తీసుకొచ్చాడు. ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. నిందితుడిని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.


