Bengaluru Jail Criminal using Mobile Phone: ఈ స్టోరీ చదివితే ఎవరికైనా జల్సా సినిమా ఠక్కున గుర్తొస్తుంది. కఠిన కారాగార శిక్ష పడిన ఖైదీలు జైల్లో ఎక్సర్‌సైజులు చేయడం, ఫోన్లు మాట్లాడటం, అక్కడే క్రైమ్ డీలింగ్స్ చేయడం.. టీవీ, బెడ్, హెల్తీ ఫుడ్, బాడీగార్డ్స్, ఇలా జైలు ఊచల మధ్య సకల రాచ మర్యాదలు అనుభవించడం.. అప్పట్లోనే సమాజం గురించి ఓ అవగాహన కల్పించారు. ఇక, టెక్నాలజీ యుగంలో ఇప్పుడు జైల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. అందుకు బెంగళూరు జైలు వీడియో ఉదాహరణ..
Also Read: https://teluguprabha.net/crime-news/woman-killed-mother-in-law-thief-and-police-game-visakhapatnam/
20 మందిని మహిళలను రేప్ చేసి, హత్యలు చేసిన ఓ దోషి కర్ణాటక రాజధాని బెంగళూరు జైలులో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నాడు. జైల్లో హాయిగా మొబైల్ ఫోన్లు వాడుతూ.. టీవీ చూస్తూ రాజ భోగాలు అనుభవిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ ఉమేష్ రెడ్డి అనే దోషి ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. 1996-2022 మధ్య అతడు 20 మంది మహిళలపై అత్యాచారం చేసి.. వారిలో 18 మందిని హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో అతడికి కోర్టు ముందుగా మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
ఆ తర్వాత అతను తన మానసిక పరిస్థితి బాలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. మరణ శిక్షను రద్దు చేసి ఉమేష్ రెడ్డికి 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా మార్పులు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలో జైల్లో ఉన్న ఉమేష్ రెడ్డి తాజాగా మొబైల్‌లో ఫోన్ మాట్లాడుతూ ఉండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతని వద్ద రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు, ఓ కీప్యాడ్ మొబైల్ ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా అతనితో పాటు ఇతర ఖైదీలు కూడా మొబైల్ ఫోన్లను వాడుతూ వీడియోలో కనిపిస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/vande-bharat-rss-song-controversy/
ఇక ఉమేష్ రెడ్డి ఉన్న గదిలో టీవీ కూడా ఉండటం గమనార్హం. రన్యారావు బంగారు స్మగ్లింగ్ కేసులో ఇటీవల తరుణ్ రాజు అరెస్టు కాగా.. అతడు కూడా ఆ జైల్‌లో మొబైల్ ఫోన్ వాడుతున్నట్లు తేలింది. బెంగళూరు సెంట్రల్ జైల్లో ఖైదీలు, రేపిస్టులు, హంతకులు మొబైల్ ఫోన్లు వాడుతూ ఎంజాయ్ చేస్తూ గడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వీడియో సీఎం సిద్ధరామయ్య దృష్టికి చేరడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Terror suspects, smugglers, and rapists getting royal treatment in Bengaluru jail….. What kind of justice system is this?
Once again, shocking visuals have emerged from Parappana Agrahara Central Jail in Bengaluru, raising serious questions about the state of our prison… pic.twitter.com/5D4PfA73Gz
— Karnataka Portfolio (@karnatakaportf) November 8, 2025


