Thursday, July 4, 2024
Homeనేషనల్Covid-19: ఇండియాలో మరో కోవిడ్ వేవ్ వచ్చే ఛాన్స్ లేదా? నిపుణులు ఏం చెబుతున్నారు?

Covid-19: ఇండియాలో మరో కోవిడ్ వేవ్ వచ్చే ఛాన్స్ లేదా? నిపుణులు ఏం చెబుతున్నారు?

Covid-19: చైనాలో ఉన్నట్లుండి పెరిగిపోతున్న కోవిడ్ కేసులు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇండియా కూడా ఈ విషయంలో అప్రమత్తమైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, చైనాలోలాగా మన దేశంలో కోవిడ్ విజృంభించే అవకాశాలు ఉండకపోవచ్చని కొందరు నిపుణుల అభిప్రాయం.

- Advertisement -

దీనికి కొన్ని కారణాలు చెబుతున్నారు నిపుణులు. ఇండియాకు, చైనాకు ఉన్న తేడాల్ని గమనిస్తే ఈ విషయం అర్థమవుతోందంటున్నారు. ఇండియాలో 96 శాతం మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. పైగా మన దేశంలో తీసుకున్న వ్యాక్సిన్లలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ వంటివే 80 శాతం ఉన్నాయి. చైనాలో ప్రజలు తీసుకున్న వ్యాక్సిన్లతో పోలిస్తే మన దేశంలో తీసుకున్న వ్యాక్సిన్లు మరింత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని అనేక అధ్యయనాలు తేల్చాయి. కోవిడ్ వైరస్ నుంచి మన వ్యాక్సిన్లు అదనపు రక్షణ ఇస్తున్నాయి.

చైనా వ్యాక్సిన్లు పెద్ద వారిపై అంత ప్రభావవంతంగా పని చేయడం లేదు. దీంతో అక్కడ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇండియాలో బూస్టర్ డోసులు తీసుకున్న వారి శాతం కూడా ఎక్కువే. 100లో 16 మంది మన దేశంలో బూస్టర్ డోసులు తీసుకున్నారు. ఇక చైనాలో కోవిడ్ కేసులు పెరిగేందుకు మరో కారణం.. అక్కడ కోవిడ్ విజృంభించే ప్రతిసారీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీంతో చాలా మందికి ఇప్పటికీ కరోనా సోకలేదు. వాళ్లంతా ఇప్పుడు కరోనా బారిన పడుతున్నారు. కానీ, మన దేశంలో భారీ స్థాయిలో కరోనా బారిన పడి, ఇప్పటికే కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకుని ఉండటం, దీన్ని ఎదుర్కొనే శక్తి మనవాళ్లు కలిగి ఉండటం, వ్యాక్సినేషన్ పూర్తవడం వల్ల తిరిగి కరోనా బారినపడే అవకాశాలు తక్కువ.

చైనాలో ఇప్పటివరకు 2 మిలియన్ల ప్రజలే కరోనా బారిన పడితే, మన దేశంలో దాదాపు 45 మిలియన్ల ప్రజలు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం చైనాలో కోవిడ్ విజృంభణకు కారణం ఒమిక్రాన్ సబ్ వేరియెంట్లైన బీఎఫ్.7. బీ.క్యూ.1.1. వీటిలో బీఎఫ్.7 వేరియెంట్‌ను మన దేశంలో గత జూలైలోనే గుర్తించారు. అంటే ఈ వేరియెంట్ మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, కోవిడ్ కేసులు గణనీయంగా పెరగలేదు. ఇలాంటి కారణాల వల్ల మనదేశంలో కోవిడ్ మళ్లీ భారీ స్థాయిలో విజృంభించకపోవచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం తప్పనిసరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News