దేశ రాజధాని ఢిల్లీ సీఎం(Delhi CM) ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో నూతన ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా (Rekha Gupta) ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ఇక ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ ప్రమాణం చేయగా.. మజీందర్ సింగ్ సిర్సా, పంకజ్ కుమార్ సింగ్, రవీందర్ సింగ్ ఇంద్రజ్, ఆశీష్ సూద్, కపిల్ మిశ్రా మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు.
- Advertisement -
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ, పలువురు కేంద్రమంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. కాగా 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది.