మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) పార్థివదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాళులర్పించారు. ఈరోజు ఢిల్లీకి చేరుకున్న ఆయన నేరుగా మన్మోహన్ నివాసానికి చేరుకున్నారు. మన్మోహన్ పార్థివదేహం వద్ద అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేవంత్‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి రాజనరస్సింహా, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, తదితర నేతలు ఉన్నారు.