Karnataka Road Accident: కర్ణాటక రోడ్లపై రెండు రోజుల క్రితం జరిగిన రక్తపుధారల ఘటన మరువకముందే మరో దుర్ఘటన చోటుచేసుకుంది. పొద్దంతా పనిచేసి ఇంటికి బయలుదేరిన కూలీలు మార్గమధ్యలోనే దుర్మరణం చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: https://teluguprabha.net/telangana/harish-rao-coments-on-rythu-discom/
కర్ణాటక- తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలోని చిక్కబల్లాపుర జిల్లా బాగేపల్లి దగ్గర కంటైనర్ లారీని ఆటో ఢీకొనడంతో ఆరుగురు కూలీలు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుంకాలమ్మ దేవాలయం సమీపంలో వెనుక నుంచి వస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఐదుగురు కూలీలు అక్కడిక్కడమే మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Also Read: https://teluguprabha.net/telangana/harish-rao-coments-on-rythu-discom/
ప్రమాదంలో ఆటో పూర్తిపూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

