Road accident| ఉత్తరాఖండ్(Uttarkhand)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అల్మోరాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు పేర్కొన్నారు.
పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే బస్సు లోయలో పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.