Thursday, March 12, 2026
Homeనేషనల్Rohit Shetty: రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల కలకలం.. అర్ధరాత్రి దుండగుల దాడి.!

Rohit Shetty: రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల కలకలం.. అర్ధరాత్రి దుండగుల దాడి.!

Breaking News : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటన ముంబయిలో తీవ్ర కలకలం సృష్టించింది. జుహు ప్రాంతంలోని ఆయన ఇంటిపై అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడటం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ముంబయిలోని జుహులో ఉన్న రోహిత్ శెట్టి నివాసం వద్ద శనివారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -

KCR: నేడు కేసీఆర్ నివాసంలో సిట్‌ విచారణ.. నంది నగర్‌లో భారీ భద్రత, ట్రాఫిక్ ఆంక్షలు!

బైక్‌పై వచ్చిన ఒక వ్యక్తి రోహిత్ శెట్టి ఇంటిని లక్ష్యంగా చేసుకుని నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడు వేగంగా అక్కడి నుంచి పరారయ్యాడు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో రోహిత్ శెట్టికి కానీ, ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి గాయాలు కాలేదు.

పోలీసుల దర్యాప్తు

సమాచారం అందుకున్న వెంటనే ముంబయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు అక్కడ ఐదు బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముంబయి పోలీస్ కమిషనర్ దేవన్ భారతి స్వయంగా ఈ ఘటనను ధృవీకరించారు. నిందితుడిని గుర్తించడానికి పోలీసులు ఆ ప్రాంతంలోని సిసిటివి (CCTV) ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

బాలీవుడ్ వర్గాల్లో ఆందోళన

‘సింగం’, ‘గోల్‌మాల్’ వంటి యాక్షన్ , కామెడీ బ్లాక్ బస్టర్ చిత్రాలతో గుర్తింపు పొందిన రోహిత్ శెట్టిపై ఇలాంటి దాడి జరగడం బాలీవుడ్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఆయన ‘గోల్‌మాల్ 5’ చిత్ర పనుల్లో నిమగ్నమై ఉన్నారు. గతంలో సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల ఇళ్ల వద్ద కూడా ఇలాంటి దాడులు జరిగిన నేపథ్యంలో, సినీ ప్రముఖుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

Pakistan Bloodshed: బలూచిస్థాన్‌లో రక్తపాతం.. BLA దాడుల్లో 125 మంది మృతి.!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News