Homeనేషనల్Cocaine: డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు.. రూ.1,000 కోట్ల విలువైన కొకైన్‌ సీజ్‌!

Cocaine: డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు.. రూ.1,000 కోట్ల విలువైన కొకైన్‌ సీజ్‌!

Cocaine: గుజరాత్‌లోని కచ్ తీరంలో అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా గుట్టును అధికారులు రట్టు చేశారు. గుజరాత్ ఏటీఎస్‌, కోస్ట్‌ గార్డ్ సంయుక్త సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడిలో భారీ మొత్తంలో కొకైన్ పట్టుబడింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 1,000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

పాకిస్తాన్ నుంచి వచ్చిన నౌకలోనే కొకైన్‌: అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏటీఎస్, కోస్ట్ గార్డ్ బృందాలు కచ్ తీరంలో సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. పాకిస్తాన్‌లోని పోర్ట్ ఖాసీం నుంచి వచ్చిన ఒక అనుమానాస్పద నౌకను తనిఖీ చేయగా గ్స్ మాఫియా గుట్టు రట్టయింది. నౌకలో అత్యంత చాకచక్యంగా దాచిన 100 కిలోలకు పైగా కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also read-Supreme Court: ఈసీకి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్.. సర్‌(SIR)పై కీలక తీర్పు

క్యాప్సూల్స్ రూపంలో స్మగ్లింగ్: డ్రగ్స్ రవాణా కోసం స్మగ్లర్లు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. స్వాధీనం చేసుకున్న కొకైన్‌ను అధికారులు పరిశీలించగా.. అది క్యాప్సూల్స్ రూపంలో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 84 క్యాప్సూల్స్‌ను అధికారులు పట్టుకోగా.. ఇందులో ఒక్కో క్యాప్సూల్‌లో సుమారు 1.04 కేజీల కొకైన్ ఉన్నట్లు నిర్ధారించారు. భారత్‌లోకి ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ చేరవేయడం వెనుక ఉన్న అంతర్జాతీయ శక్తులెవరు? ఈ నెట్‌వర్క్ ఎక్కడివరకు విస్తరించింది? అనే కోణంలో గుజరాత్ ఏటీఎస్, కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణను ముమ్మరం చేశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News