Tuesday, December 9, 2025
HomeTop StoriesSabarimala Rules: శబరిమల అయ్యప్ప దర్శనంపై అమల్లోకి కొత్త రూల్.. రోజుకు బుక్కింగ్స్ లిమిట్ ఫిక్స్

Sabarimala Rules: శబరిమల అయ్యప్ప దర్శనంపై అమల్లోకి కొత్త రూల్.. రోజుకు బుక్కింగ్స్ లిమిట్ ఫిక్స్

Sabarimala Overcrowding: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మంగళవారం తెరుచుకోగానే దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు ఒక్కరాత్రిలోనే కొండకు చేరుకోవటంతో ఆలయ పరిసరాలు, యాత్రా మార్గాలు రద్దీగా మారిపోయాయి. వార్షిక మండల–మకర విలక్కు యాత్రా సీజన్ ప్రారంభమైన తొలి 48 గంటల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ట్రావన్ కోర్ బోర్డుతో పాటు పోలీసులకూ పెద్ద సవాలుగా మారిపోయింది.

- Advertisement -

వేల సంఖ్యలో స్వాములు అయ్యప్ప స్వామి 18 మెట్లకు ముందు దర్శనం కోసం వేచి చూస్తున్న వీడియోలు భక్తుల తాకిడిని సూచిస్తున్నాయి. చిన్న పిల్లలతో సహా భక్తులు గంటల తరబడి క్యూలలో నిల్చొని ఉన్నారు. దీంతో అవాంచనీయ ఘటనలు జరగకుండా.. రద్దీని మేనేజ్ చేసేందుకు కొత్త ఆలోచనతో వస్తున్నారు అక్కడి అధికారులు. దీంతో అయ్యప్ప దర్శనానికి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి.

ఊహలకు మించిన రద్దీని నియంత్రించేందుకు ట్రావెన్ కోర్ బోర్డ్, పోలీసులు బుధవారం నుంచి కొత్త ఆంక్షలు అమలు చేస్తున్నారు. రోజుకు గరిష్టంగా లక్షమంది భక్తులకు మాత్రమే అనుమతి ఉండగా.. స్పాట్ దర్శన బుకింగ్స్‌ను రోజుకు 20 వేలకే పరిమితం చేశారు. దీంతో టికెట్ల కోసం భక్తులు పంబకు వేగంగా చేరకుండా నిలక్కల్‌లో 7సెంటర్లు ఏర్పాటుచేశారు. ఈ క్రమంలోనే నిలక్కల్‌లో రాత్రి భక్తుల బస కోసం ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే క్యూ లైన్లలో ఉన్న భక్తులకు నీరు, ఆారం, కాఫీ వంటి సౌకర్యాలను కల్పించింది బోర్డ్. దీనికి తోడు శుభ్రత, నీటి పంపిణీ, రద్దీ నియంత్రణ కోసం తమిళనాడు నుంచి 200 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.

క్యూలను దాటే భక్తులు, తాము బుక్ చేసిన తేదీ కాకుండా ఇతర రోజుల్లో వర్చువల్-క్యూ టికెట్లతో వచ్చినవారే గందరగోళానికి కారణమని ట్రావెన్ కోర్డ్ బోర్డ్ అధ్యక్షుడు కె. జయకుమార్ తెలిపారు. అదనంగా అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ మంగళవారం ఒక్కరోజే 37 వేల స్పాట్ బుకింగ్స్ చేయక తప్పలేదని ఎడిజిపి ఎస్. శ్రీజిత్ చెప్పారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, తగిన ప్రణాళిక లేకపోవడం వల్ల రద్దీ పెరిగిందని, తాగునీరు, పోలీసులు వంటి అవసరాలపై ముందస్తు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ పరిస్థితిని కేరళ హైకోర్టు తక్షణమే పరిశీలించాలని ప్రతిపక్షనేత వీ.డి. సతీశన్ డిమాండ్ చేశారు. భారీ రద్దీలో క్యూలో నిలబడిన 58 ఏళ్ల మహిళ గుండెపోటుతో మరణించగా.. ఆమె మృతదేహాన్ని బోర్డ్ అధికారులు స్వస్థలానికి తరలిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News