Sunday, November 16, 2025
Homeనేషనల్Sadhguru : రెండు బ్రెయిన్ సర్జరీల తర్వాత సాహస యాత్ర చేపట్టిన సద్గురు

Sadhguru : రెండు బ్రెయిన్ సర్జరీల తర్వాత సాహస యాత్ర చేపట్టిన సద్గురు

Sadhguru:రెండు మెదడు ఆపరేషన్ల తర్వాత, కేవలం 18 నెలల్లో సద్గురు జగ్గీ వాసుదేవ్ మోటారు సైకిల్‌పై చేపట్టిన కైలాస మానససరోవర యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. వైద్యులు తీవ్రంగా వారించినప్పటికీ, ఆయన చూపిన ఈ సాహసం కేవలం ఒక యాత్ర కాదు, యోగాకున్న అద్భుతమైన శక్తికి ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది.

- Advertisement -

గత ఆగస్టు 9న ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ ప్రయాణంలో, సద్గురు ఎంతో కష్టతరమైన మార్గాల్లో మోటారు సైకిల్‌పై ప్రయాణించారు. యాత్ర అనంతరం కోయంబత్తూరు చేరుకున్న ఆయనకు అనుచరులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సద్గురు మాట్లాడుతూ, తన యాత్ర విజయానికి కారణం యోగా సాధనే అని స్పష్టం చేశారు. “ఈ యాత్రలో మోటారు సైకిల్‌పై ప్రయాణిస్తున్నప్పుడు యోగా నాకు ఎంతగానో ఉపయోగపడింది. యోగా సాధన వల్లే ఇంతటి కఠినమైన యాత్రను ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలిగాను” అని ఆయన అన్నారు.

 

Inter Exams : ఇంటర్ పరీక్షల్లో భారీ మార్పులు

ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపడం ద్వారా సద్గురు యోగా ప్రాముఖ్యతను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. ఇది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా యోగా ఎలా బలాన్ని ఇస్తుందో తెలియజేస్తుంది. సద్గురు యాత్ర యోగా పట్ల ఆసక్తి ఉన్నవారికే కాకుండా, ప్రతి ఒక్కరికీ ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపే ఒక గొప్ప ప్రేరణగా నిలిచిందని సిద్దాంతులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad