Tuesday, October 8, 2024
Homeనేషనల్Cigarettes : విడిగా సిగరెట్ల విక్రయంపై నిషేధం ? ఆలోచిస్తోన్న కేంద్రం

Cigarettes : విడిగా సిగరెట్ల విక్రయంపై నిషేధం ? ఆలోచిస్తోన్న కేంద్రం

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. సిగరెట్లను విడిగా విక్రయించడంపై నిషేధం విధించాలని కేంద్రం భావిస్తోంది. సిగరెట్లను లూజుగా విక్రయించడాన్ని నిషేధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేయడంతో కేంద్రం ఆలోచనలో పడింది. . సిగరెట్లను విడిగా విక్రయించడంతో పొగాకు వినియోగం తగ్గడం లేదని, ఫలితంగా దేశంలో ప్రతిఏటా 3.5 లక్షల మంది మరణిస్తున్నట్టు తెలిపింది. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు పన్నులు పెంచుతున్నా ఫలితం ఉండడం లేదని కమిటీ అభిప్రాయపడింది.

- Advertisement -

ప్రస్తుతం సిగరెట్ పై 28 శాతం జీఎస్టీ ఉందని, అలాగే కాంపెన్సేషన్ సెస్ కూడా ఉందని తెలిపింది. మొత్తం కలిపి 290 శాతం వరకు ఎక్సైజ్ సుంకం ఉంది. అన్నీ కలిపి లెక్కిస్తే ఒక్కో సిగరెట్ ధరలో 64 శాతం వరకు పన్ను ఉంటుందని పేర్కొంది. సిగరెట్ రేటు ఎంత పెరిగినా.. అవి సిగరెట్ల వినియోగాన్ని నియంత్రించలేకపోతున్నాయని, దీని వల్ల నోటి క్యాన్సర్ ముప్పు కూడా అంతకంతకూ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సుతో యోచనలో పడిన కేంద్రం..వచ్చే బడ్జెట్ సమావేశాల్లో లూజ్ సిగరెట్లపై నిషేధం విధిస్తూ ప్రకటిస్తుందని తెలుస్తోంది.

విరివిగా విక్రయించే సిగరెట్లపై నిషేధం ఎంతవరకూ పనిచేస్తుంది? అసలు అలాంటి నిషేధాన్ని ఎలా అమలు చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News