SandStorm Rajasthan: రాజస్థాన్‌లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. పలు జిల్లాల్లో ఇసుక తుఫాన్ తర్వాత భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ ఈదురు గాలులతో నివాస ప్రాంతాలను ఇసుక ముంచెత్తింది.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-review-on-telangana-formation-celebrations/
రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భీకర ఇసుక తుఫాను(ఆంధీ), భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చురు, బికనీర్, శ్రీగంగానగర్ జిల్లాల్లో దట్టమైన ఇసుక మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో మధ్యాహ్నం వేళల్లోనూ చిమ్మచీకట్లు అలుముకున్నాయి. గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు విజిబిలిటీ సున్నాకు పడిపోయింది. దీంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది.
రోడ్లపై అవస్థలు: ఇసుక తుఫాను బీభత్సంతో రహదారులపై వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు వాహనాలను రోడ్ల మధ్యలోనే నిలిపివేసి, లైట్లు వేసి నిల్చున్నారు. తుఫాను బీభత్సంతో ఇళ్లపై కప్పులు, రేకులు ఎగిరిపోవడమే కాకుండా, పెద్ద ఎత్తున దుమ్ము, ఇసుక నివాస ప్రాంతాల్లోకి చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read: https://teluguprabha.net/top-stories/bcci-announces-probable-list-for-asian-games/
ఎల్లో అలర్ట్: ఇసుక తుఫానుల తర్వాత పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల వడగళ్ల వానలు కురిశాయి. రానున్న రోజుల్లో కూడా జైపూర్, అజ్మీర్, జోధ్పూర్, బికనీర్, కోట డివిజన్లలో బలమైన గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

