HomeTop StoriesSara Tendulkar: బాడీ షేమింగ్‌ పోస్ట్‌.. నెటిజన్‌కు సారా టెండూల్కర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Sara Tendulkar: బాడీ షేమింగ్‌ పోస్ట్‌.. నెటిజన్‌కు సారా టెండూల్కర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Sara Tendulkar angry on Body shaming post: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెండూల్కర్‌ గారాల పట్టి సారా తెండూల్కర్ తాజాగా ఒక వీడియోగ్రాఫర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను బాడీషేమింగ్ చేస్తూ తీసిన రీల్‌ను పోస్టు చేయడంపై ఆమె సోషల్‌ మీడియా వేదికగా మండిపడ్డారు. సారా, తన వదిన (అర్జున్‌ భార్య) సానియా చందోక్‌తో కలిసి ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అది ఆమె దృష్టికి రావడంతో తీవ్రంగా స్పందించారు. ఆ వీడియోలోని దృశ్యాలను తన ఇన్‌స్టా స్టోరీలో సారా షేర్ చేశారు. ‘‘ఇది చాలా అసహ్యకరమైన కామెంట్‌. ఇది జర్నలిజం అనిపించుకోదు. మమ్మల్ని ఇలా వదిలేయండి. నేను మిమ్మల్ని మందలించన వెంటనే.. మీరు మీ పోస్టు డిలీట్ చేయొచ్చు. అంతమాత్రాన మీ తప్పు సరిదిద్దుకున్నట్టు కాదు.’’ అని ఘాటుగా స్పందించారు.

- Advertisement -

Also read: Bandi Bhagirath: బండి భగీరథ్‌ కేసులో కీలక పరిణామం.. రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా..

కాగా, సారా టెండూల్కర్‌ ఇన్‌స్టాలో చురుగ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లైఫ్‌కు సంబంధించి అప్‌డేట్ షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. ఇటీవల తన సోదరుడు అర్జున్ వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెటిజన్లతో పంచుకున్నారు. ఆమె ఇన్‌స్టా ఖాతాకు 90 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News