SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల(FDs)పై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగానికి చెందిన ఈ దిగ్గజ బ్యాంకు వెల్లడించింది. కాలపరిమితులను బట్టి వడ్డీ రేట్లను 15 నుంచి 100 బేసిక్ పాయింట్ల మేరకు పెంచింది. ఈ కొత్త రేట్లు నేటి(డిసెంబర్ 13) నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఎస్‌బీఐ సిబ్బంది, ఎస్‌బీఐ పింఛనుదారులకు అదనంగా 1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
- Advertisement -
- 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం వడ్డీని అందిస్తోంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీలపై 3.9 శాతం, అలాగే 180 రోజుల నుంచి 210 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.25 శాతం, 211 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై 5.75 శాతం వడ్డీని అందిస్తోంది.
- ఏడాది నుంచి రెండేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై అయితే 6.75 శాతం వడ్డీ లభిస్తోంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా ఇదే వడ్డీ రేటు లభిస్తోంది. 3 నుంచి 5 ఏళ్ల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 6.25 శాతం వడ్డీ వస్తుంది. 5 నుంచి 10 ఏళ్ల టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 6.25 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు
సీనియర్ సిటిజన్స్‌కు అధిక వడ్డీ లభిస్తుంది. వీరికి 0.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. వీరికి వడ్డీ రేటు 3.5 శాతం నుంచి 7.25 శాతం వరకు ఉంది.