పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెలువరించిన తీర్పును నలుగురు సభ్యులు సమర్థించటం విశేషం. దీంతో 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసే నిర్ణయం చెల్లుబాటు అవుతుందని అత్యున్నత ధర్మస్థానం వెల్లడించినట్టైంది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బ్యాంకు మధ్య సంప్రదింపులు జరిగాకే నోట్ల రద్దు జరిగిందని, 6 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. నోట్ల రద్దు సరైన నిర్ణయం కాదంటూ 58 పిటిషన్లు దాఖలవ్వగా సుదీర్ఘంగా ఈ కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం నేడు తీర్పు వెలువరించటం విశేషం. నోట్ల రద్దుపై రెండు తీర్పులు వెలువడగా రెండూ భిన్నంగా ఉన్నాయి.
SC: నోట్ల రద్దుపై రెండు భిన్న తీర్పులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES