Tuesday, September 17, 2024
Homeనేషనల్SC on BBC: బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

SC on BBC: బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించటంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈరోజు నోటీసులు జారీ చేసింది. బీబీసీ డాక్యుమెంటరీల నిషేధంపై రెండు పిటిషన్లు విన్న ధర్మాసనం ఈమేరకు నోటీసులు ఇచ్చింది.

- Advertisement -

రెండు భాగాలుగా ఉన్న బీబీసీ డాక్యుమెంటరీని దేశంలో కేంద్రం నిషేధించటంపై సుప్రీంకోర్టులో ఈనెల 6 నుంచి విచారణ జరుగనుంది. 2002లో గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్రపై బీబీసీ రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ఎక్కడా ప్రదర్శించ రాదని కేంద్రం బ్యాన్ విధించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హిందూ ఎడిటర్ ఎన్ రామ్, అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, ఎం ఎల్ శర్మ, టీఎంసీ ఎంపీ మహువా మిత్రా వంటివారు దీనిపై పిల్ వేశారు. ‘ఇండియా-ది మోడీ క్వశ్చన్’ అనే పేరుతో ఉన్న ఈ పాత డాక్యుమెంటరీని నిరంకుశత్వంతో రాజ్యాంగ విరుద్ధంగా నిషేధించారనే అభియోగాలున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛను ఈ నిషేధం అణచివేస్తోందని వీరు న్యాయపోరాటానికి దిగారు.

ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్వీట్లు కూడా తొలగించేలా సోషల్ మీడియాను కేంద్రం ఆదేశించింది. జనవరి 21వ తేదీన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 కింద ఈమేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News