Saturday, November 15, 2025
Homeనేషనల్Accident: లోయలో పడిపోయిన స్కూల్‌ బస్సు.. ఇద్దరు విద్యార్థులు మృతి, 50 మందికి గాయాలు

Accident: లోయలో పడిపోయిన స్కూల్‌ బస్సు.. ఇద్దరు విద్యార్థులు మృతి, 50 మందికి గాయాలు

School Bus Accident at Devgai Ghat: దేశవ్యాప్తంగా వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ మందితో వెళ్తున్న బస్సుల్లోనే విషాదకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీపావళి సెలవుల అనంతరం విద్యార్థులంతా తిరిగి పాఠశాలకు వెళ్తుండగా అనుకోని ప్రమాదం వారిని ఆస్పత్రి పాలు చేసింది. విద్యార్థుల్లో ఇద్దరు మృతి చెందారు. మహారాష్ట్రలో ఓ స్కూల్‌ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/ajit-pawar-son-parth-pawar-pune-land-controversy-explained/

మహారాష్ట్రలోని నందూర్బార్‌లో అక్లకువా-మోల్గి రహదారిపై ఆదివారం స్కూల్ బస్సుకు ఘోర ప్రమాదం సంభవించింది. దేవ్‌గయ్ ఘాట్ వద్ద ఒక ప్రైవేట్‌ స్కూల్ బస్సు 100 నుంచి 150 అడుగుల లోతైన లోయలో పడిపోగా.. దుర్ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. బస్సులోని దాదాపు 50 మందికి పైగా విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. మరణించిన విద్యార్థులు బస్సు కింద నలిగిపోయినట్లు తెలుస్తోంది. 

మోల్గి గ్రామం నుంచి అక్లకువాకు వెళ్తున్న విద్యార్థుల బస్సు అమ్లిబారి ప్రాంతంలో రోడ్డును ఢీకొట్టడంతో.. 100 – 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఘటనలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 7, 12 ఏళ్ల విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా విద్యార్థులకు తీవ్రంగా గాయాలు కావడంతో.. వారిని హుటాహుటిన అక్లకువా గ్రామీణ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/pawan-kalyan-convoy-runs-over-woman-leg-in-musali-madugu-visit/

బస్సులో 30 సీట్‌ కెపాసిటీ ఉండగా.. 56 మంది విద్యార్థులతో పరిమితికి మించి ఉండటం వల్లే బస్సు అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గతంలోనూ ఈ దేవ్‌గయ్‌ ఘాట్‌ వద్ద ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మరోసారి అదే ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad