Saturday, November 15, 2025
Homeనేషనల్School Bus: స్కూల్ బస్సుపై దూసుకెళ్లిన రైలు.. ఇద్దరు మృతి

School Bus: స్కూల్ బస్సుపై దూసుకెళ్లిన రైలు.. ఇద్దరు మృతి

School Bus: తమిళనాడులోని కడలూర్‌కి సమీపంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. సెమ్మన్‌కుప్పం రైల్వే క్రాసింగ్ వద్ద ఓ స్కూల్ బస్సు విద్యార్థులతో వెళ్తోంది. అంతలోనే రైల్వే గేటు దాటే క్రమంలో బస్సు డ్రైవర్ తప్పిదం వల్ల వ్యాన్‌పై రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్కూల్ బస్సును రైలు బలంగా ఢీ కొట్టడం వల్ల అందులోని ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. పలువురు స్టూడెంట్స్ తీవ్రంగా గాయపడ్డారు.

ఏం జరిగిందంటే?

స్కూల్ విద్యార్థులతో కూడిన ఓ బస్సు సెమ్మన్‌కుప్పం వద్ద రైల్వే ట్రాక్‌ను దాటి వెళుతోంది. అదే సమయంలో వేగంగా వస్తున్న రైలు ఆ స్కూల్ బస్సు పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పాఠశాలకు సంబంధించిన వ్యాన్ నుజ్జునుజ్జయ్యింది. విద్యార్థుల రోదన చూసి స్థానికులు కంటతడి పెడుతున్నారు.

- Advertisement -

ఈ ఘోర ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న కొందరు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన చిన్నారులను హుటాహుటిన కడలూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థులు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ తప్పదానికి కారణం ఎవరని.. రైల్వే గేటు ఉద్యోగిదా?? లేదా బస్సు డ్రైవర్ తప్పా?? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad