Schools Closed in Karnataka due to heavy Rainfall: కర్ణాటకను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని ఏరియాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు అధికారులు. అంతేకాకుండా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

కర్ణాటకలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడి ధాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.

ఈ భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు, స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో డిగ్రీ కళాశాలలను కూడా మూసివేశారు.

ముఖ్యంగా దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలుకాలోని అన్ని స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. ఈ ప్రాంతాల్లో కొన్ని రోజులగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి.

ఉత్తర కర్ణాటక, కొడుగు జిల్లాలోని విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు.

ఈ భారీ వర్షాల కారణంగా కర్ణాటక సర్కారు జూన్ 25న కూడా విద్యాసంస్థలకు హాలీడేస్ ఇచ్చింది.

ఈ భారీ వర్షాల కారణంగా కర్ణాటక సర్కారు జూన్ 25న కూడా విద్యాసంస్థలకు హాలీడేస్ ఇచ్చింది.ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.