Sunday, January 18, 2026
Homeనేషనల్Schools Holidays: చలి తీవ్రతకి విద్యార్థులకు బంపర్‌ ఆఫర్‌.. ఈ పాఠశాలల్లో వారంపైగా సెలవులు.!

Schools Holidays: చలి తీవ్రతకి విద్యార్థులకు బంపర్‌ ఆఫర్‌.. ఈ పాఠశాలల్లో వారంపైగా సెలవులు.!

Schools Holidays on December 12th: వాతావరణ పరిస్థితులు, స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల కారణంగా డిసెంబర్‌ నెలలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు విద్యాసంస్థలకు ప్రత్యేక సెలవులు మంజూరు చేశాయి. ఇప్పటికే ఈ నెలలో క్రిస్మస్‌ సెలవులపై ప్రభుత్వాలు ప్రకటన చేయగా.. ఈ అదనపు సెలవులతో ప్రజలు, విద్యార్థులు చలి తీవ్రత నుంచి బయటపడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెలలో ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడు సెలవులు ఉన్నాయి.. తెలంగాణలోనూ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎన్ని రోజులు సెలవు ప్రకటించారు. ఈ కథనంలో తెలుసుకుందాం. 

- Advertisement -

కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేరళలో రెండో దశ పోలింగ్‌ నేపథ్యంలో ఈ రోజు సెలవు ప్రకటించారు. తెలంగాణలో మొదటి దశ ఓటింగ్‌ నేపథ్యంలో పోలింగ్ జరుగుతున్న పాఠశాలలకు సెలవు మంజారు చేశారు. అయితే డిసెంబర్‌ 12న పాఠశాలల మూసివేతపై ఆయా ప్రభుత్వాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 

Also Read: https://teluguprabha.net/viral/noodles-with-maggi-capsule-in-30-seconds-ai-video/

కాగా, డిసెంబర్ 24, 2025 నుంచి జనవరి 5, 2026 వరకు క్రిస్మస్ సెలవుల కోసం పాఠశాలలను మూసివేయాలని రాష్ట్రం కొత్త ఉత్తర్వులను ప్రకటించింది. ఇక తెలంగాణలో రెండు, మూడో విడతల పోలింగ్ కోసం డిసెంబర్ 14(ఆదివారం), డిసెంబర్ 17 తేదీల్లో సంబంధిత పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. 

ఇక శీతాకాలం నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. భారీ హిమపాతం, విపరీతమైన చలి, దట్టమైన పొగమంచు కారణంగా ఆ రాష్ట్రంలో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో పాఠశాలలకు డిసెంబర్ 8 నుంచి 14 వరకు ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది. ప్రతికూల వాతావరణం విద్యార్థుల ప్రయాణానికి ఇబ్బంది కలిగించడంతో పాటు వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఈ మేరకు అధికారులు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. 

Also Read: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/alient-global-team-enjoyed-the-flavors-and-culture-of-telangana/

ఇక దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్ 23, 2025 నుంచి జనవరి 1, 2026 వరకు పాఠశాలలకు శీతాకాల సెలవులు మంజూరు చేశారు. వాతావరణ పరిస్థితుల మేరకు ఇందుకు సంబంధించి తేదీలు మారే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల చేస్తారు. కాగా, శీతాకాల పరిస్థితులు, ఎన్నికల నిర్వహణ దృష్ట్యా పాఠశాలల మూసివేతపై ధ్రువీకరణ కోసం తల్లిదండ్రులు సంబంధింత అధికారులను సంప్రదించడం ఉత్తమం. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News