Thursday, May 22, 2025
Homeనేషనల్Narendra Modi: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ పై.. ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే..!

Narendra Modi: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ పై.. ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే..!

నక్సలిజాన్ని నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన పోరాటానికి మరో కీలక మైలురాయి దాటింది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా అడవుల్లో భద్రతా బలగాలు నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి, అగ్రనాయకుడు నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు కూడా ఉన్నట్టు పోలీసులు ధృవీకరించారు. ఆయన మృతి నక్సలైట్స్ కు పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు.

- Advertisement -

ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.. భద్రతా దళాల విజయంపై దేశం గర్వపడుతోందన్నారు. నక్సలిజంపై పోరులో ఇది కీలక అడుగని ఆయన అన్నారు. ప్రజలకు శాంతి, అభివృద్ధితో కూడిన భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఈ విజయాన్ని అభినందిస్తూ, మావోయిస్టు ఉద్యమానికి వెన్నుముకలాంటివాడైన బసవరాజు మృతి నక్సలిజాన్ని పూర్తిగా మూలాలు పీకే దిశగా ముందడుగు అని అన్నారు.

చరిత్రలో ఇదే తొలిసారిగా దేశవ్యాప్తంగా మావోయిస్టు కదలికను నడిపించిన ప్రధాన నాయకుడిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సుమారు 50 ఏళ్లుగా నక్సల్ ఉద్యమంలో చురుకుగా ఉన్న బసవరాజుపై ₹1.5 కోట్లు రివార్డు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆయన.. గత కొన్ని సంవత్సరాలుగాదండకారణ్యంలో సెంట్రల్ కమిటీని నడిపిస్తున్నట్లు భద్రతా వర్గాల సమాచారం.

ఈ దాడిలో బీజాపూర్‌, నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల ప్రత్యేక బలగాలు భాగస్వామ్యం అయ్యాయి. ‘బ్లాక్ ఫారెస్ట్’ అనే పేరుతో కొనసాగిన ఈ ఆపరేషన్‌లో తదుపరి దశల్లో 54 మంది నక్సలైట్లను అరెస్ట్ చేయగా, మరో 84 మంది లొంగిపోయారు. ఇదే సమయంలో, ఇటీవల ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లో 24 రోజుల పాటు కొనసాగిన మరొక ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. తాజా ఘటనతో కలిపి చూస్తే, నక్సలిజంపై భద్రతా దళాలు తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2026 మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడమే కాక, నక్సల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తోంది. దేశం ఎదుగుదల దిశగా అడుగులు వేస్తున్న వేళ, ఈలాంటి విజయాలు భద్రతా బలగాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News